జూరాలకు పోటెత్తిన వరద..24 గేట్లు ఎత్తి నీళ్లు విడుదల

జూరాలకు పోటెత్తిన వరద..24 గేట్లు ఎత్తి నీళ్లు విడుదల

మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్‌ఫ్లో 1,36,000 క్యూసెక్కులు ఉండగా.. అధికారులు అప్రమత్తమై 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అవుట్‌ఫ్లో 1,32,880 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 317.77 మీటర్లకు చేరింది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 8.164 టీఎంసీలుగా ఉంది. మరోవైపు, ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్ల ద్వారా మొత్తం 436 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

ALSO READ : విజయ్ 'జన నాయగన్' కు కావేరి సెగ..